- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకే పార్టీ... వేరు వేరుగా కార్యక్రమాలు
దిశ, భద్రాచలం : దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అనుచరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తన అనుచరులతో స్థానిక బ్రిడ్జ్ పాయింట్ దగ్గర గల ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్నికలు నాటినుండి ఎమ్మెల్యే తెల్లం, ఎఫ్ డి సి చైర్మన్ పొదెం ఇద్దరు కలిసి పాల్గొన్న కార్యక్రమాలు కేవలం రెండు, మూడు మాత్రమే.
ఈ ఇద్దరు కలిసి పని చేయకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలలో అయోమయం నెలకొంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తటస్థంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ గూటికి చేరారు. పొదెం వీరయ్య, వెంకట్రావు ప్రత్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి,ఇప్పుడు ఒకే పార్టీలో ఉండటంతో భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు కలిసి పనిచేయాలని, తెలంగాణా పి సి సి ఆ విధంగా కృషి చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.