తిరుమలాయపాలెంలో డేంజర్ బెల్స్.. వరుస రోడ్డు ప్రమాదాల్లో పలువురి మృతి

by Javid Pasha |   ( Updated:2022-12-15 05:01:14.0  )
తిరుమలాయపాలెంలో డేంజర్ బెల్స్.. వరుస రోడ్డు ప్రమాదాల్లో పలువురి మృతి
X

దిశ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాలకు తీరని వెదను మిగులుస్తున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో మండలానికి చెందిన ఐదుగురుని రోడ్డు ప్రమాదం కబలించింది. గత ఆదివారం రాత్రి మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన దువ్వ రమేశ్, అతడి భార్య రేణుక తన చెల్లి మమత కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్లి తిరిగి ప్రయాణమైన వారిని, మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. రమేష్ రేణుక దంపతులకు బాబు, పాప ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంగతి తెలియక నిస్సహాయ స్థితిలో ఆ చిన్న పిల్లల గుండెలు పలిగేలా రోదిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తురక వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. ఈ ప్రమాదంలో మృతుడి వెంకటేశ్వర్లు కొడుకు దినేష్ కాలు విరగగా, కోడలు రేణుక హైదరాబాదు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

బాలాజీ నగర్ తండాకు చెందిన భూక్య వీరన్న, వ్యవసాయ పనుల నిమిత్తం తన ద్వచక్ర వాహనంపై తిరుమలాయపాలెం గ్రామంలో పని ముగించుకొని తిరిగి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో రోడ్డు పక్కన ఉన్న కోతుల గుంపు వీరన్న పై దాడి చేయబోగా.. కోతుల దాడి భారీ నుంచి రక్షించుకునే క్రమంలో ఫినిషింగ్ స్తంభాలను ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఏడాది క్రితం పెద్ద కూతురు వివాహం జరిపించగా.. పెళ్లి కావాల్సిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పైనంపల్లి గ్రామానికి చెందిన రంగు గోవర్ధనా చారి బుధవారం హైదర్ సాయిపేట గ్రామంలో జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు. అనంతరం తిరిగి తన కారులో స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దమ్మాయిగూడెం, గోపాయిగూడెం గ్రామాల మధ్య కరెంట్ స్తంభాల ఫ్యాక్టరీ సమీపలో ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇద్దరు చిన్న పిల్లలతో మృతిని భార్య ఉమ విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదాల రూపంలో నాలుగు రోజుల వ్యవధిలో మండలానికి చెందిన ఓ మహిళ, నలుగురు పురుషులను మృత్యువు కబళించింది.

Also Read..

ఫైనాన్స్ వ్యాపారి ప్రాణాలు తీసిన మూలమలుపు

Advertisement

Next Story

Most Viewed