రెండేళ్ల క్రితం అత్యంత దారుణం.. మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్..?

by srinivas |   ( Updated:2024-10-21 03:40:47.0  )
రెండేళ్ల క్రితం అత్యంత దారుణం.. మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్..?
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు మధురైలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దళిత యువకుడి హత్య కేసులో ఆయనపై అభియోగాలున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. అయితే అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం బృందాలుగా పోలీసులు గాలించారు. చివరకు తమిళనాడు రాష్ట్రం మధురైలో శ్రీకాంత్ ఉన్నట్లు సమాచారం రావడంతో ఆయనను అనుసరించి అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన్ను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు తీసుకొస్తున్నట్లు సమాచారం.


కాగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు, వాలంటీర్ దుర్గప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. కోనసీమ అల్లర్ల సమయంలో దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు. తొలుత మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. చివరకు దుర్గాప్రసాద్ డెడ్‌బాడీ లభ్యంకావడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, మృతుడి స్నేహితుడు ధర్మేశ్‌ను పోలీసులు విచారించడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుర్గాప్రసాద్‌ను శ్రీకాంత్ చంపేందుకు తనతో పాటు మరో నలుగురి సహాయం కోరినట్లు విచారణలో ధర్మేశ్ వెల్లడించారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కోసం పోలీసులు గాలించారు. దుర్గా ప్రసాద్‌ను హత్య చేసిన నిందితులు గతంలో ఓ కేసులో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను కఠినంగా దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్య డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed