- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్‌స్టాపబుల్‌లో బాలయ్యని ఓ రేంజ్‌లో ఆడుకున్న సీఎం చంద్రబాబు.. ఆకట్టుకుంటున్న బావ బామర్దిల సరదా..!
దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే’ ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆహా ఓటీటీలో మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అన్‍స్టాపబుల్ మూడు సీజన్లను విజయవంతంగా నడిపించిన బాలయ్య 4వ సీజన్ ట్రైలర్ ద్వారా తన షోపై అభిమానుల్లో మరింత హైప్ పెంచారు. ట్రైలర్‌లో ‘మాసీయెస్ట్ సూపర్ హీరో’ అంటూ ఆహా టీజ్ చేసింది. ‘థింకింగ్ మారి తీరాల’ అంటూ ఈ ట్రైలర్లో మంచి జోష్ చూపించారు బాలకృష్ణ. ఈ నాలుగో సీజన్ అక్టోబర్ 25న మొదలవుతుందని ఆహా పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సీజన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తరువాత చోటు చేసుకున్న పలు అంశాలను చంద్రబాబు పంచుకున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదండోయ్.. బాలకృష్ణతో కలిసి చంద్రబాబు పలు టాస్క్‌లు కూడా ఆడారు. ఇక చంద్రబాబుతో బాలయ్య కూరగాయలను కొనిపించారు. ఆ తర్వాత బాలకృష్ణని ఒక రేంజ్‌లో చంద్రబాబు ఆడుకున్నారు. అలాగే బాలయ్యతో ‘బోత్ ఆర్ నాట్ ది సేమ్’ అనే డైలాగ్‌ను ముఖ్యమంత్రి చెప్పారట. మొత్తానికి ఈ షో బావ, బామర్దిల మధ్య సరదాగా సాగినట్లుగా సమాచారం. ఇక ఈ మొదటి ఎపిసోడ్ ఆహాలో అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.