రేవంత్ రెడ్డి ఖబడ్దార్... రేగా కాంతారావుతో పెట్టుకోకు : పినపాక ఎమ్మెల్యే

by S Gopi |
రేవంత్ రెడ్డి ఖబడ్దార్... రేగా కాంతారావుతో పెట్టుకోకు : పినపాక ఎమ్మెల్యే
X

దిశ, మణుగూరు: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిప్పులు చెరిగారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హాథ్ సే హాథ్ పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. రేగా కాంతారావుతో పెట్టుకోకు.. పినపాకలో కాంగ్రెస్ పార్టీని బతికించాను.... ఇక్కడ బలంగా ఉందంటే నేనే కారణం.. దేశ చరిత్రలో డీసీసీ అధ్యక్షునిగా గంటసేపు ఉన్నది నేనొక్కడినే.. గిరిజనుడిని అనే అక్కసుతో నన్ను తొలగించిన వీళ్లా... నా గురించి మాట్లాడేదని ఘాటుగా స్పందించారు. తెలంగాణా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేందుకు...తాను రాజ్యాంగ బద్దంగా విలీనమయ్యానన్నారు. ఓటుకు నోటుకు కేసులో ఉన్న వీళ్లా నా గురించి మాట్లాడేది.. నీకు దమ్ముంటే ఎవరైనా రండి..300 ఎకరాలు రుజువు చేయండి.. ముక్కు నేలకు రాస్తా.. పరువు నష్టం దావా వేస్తా అంటూ పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు.

ఆరోపణలు నిరూపిస్తే అసలు పోటీనుండి విరమిస్తానని సవాల్ విసిరారు. ఎటువంటి ఎజెండా లేకుండా తిట్టడం కోసమే వచ్చిన్నట్లుందన్నారు. రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమైనటువంటి నాయకుడు...ఆయన ఎక్కడ కూడా డిపాజిట్ కూడా రాని నాయకుడు.. కొడంగల్ ప్రజలు ఎల్లగొడితే హైదరాబాద్ కు వచ్చిండు..అలాంటి నాయకుడు తనకు నీతులు చెబుతున్నాడని అన్నాడు. పినపాక నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తాను నూటికి నూరు శాతం పనిచేశానని...పినపాక గురించి ఆయనకు ఏమి తెలుసుని ప్రశ్నించారు.

ఇక్కడకు వచ్చి తనని లాగులూడదీసి కొడతాడట...తాను తెలుసుకుంటే అసలు మణుగూరులో మీటింగ్ జరగదని.. కానీ తనకు విజ్ఞత, సంస్కారం ఉన్నవి కాబట్టే వదిలేశాను.. లేకపోతే అక్కడ సగం మంది మావాళ్ళే ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి భయంతో వచ్చానని అన్నారని.. కానీ మంచిగానే వెళ్తున్నారని అని అన్న రేవంత్ రెడ్డికి ఆమాత్రం భయం ఉండాలి తానంటే అని రేగా అన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా సమావేశాలు పెట్టుకోవాలి కానీ, మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి.. ప్రజలతో మాట్లాడేటప్పుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి..కానీ పేల్చేస్తాం.. కూల్చేస్తాం.. కొడతాం అని అంటారా? ఇదేనా పద్ధతి.. మహాత్మా గాంధీఅధ్యక్షుడుగా పనిచేసిన పార్టీ.. ఇదేనా ఆయనకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. తాము నక్సలైట్ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళమే మాకు కూడా కూల్చడం.. పేల్చడం తెలుసని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సైన్యం తిరగబడితే ఈ పదిమంది ఉరకాల్సిందేనని రేగా అన్నారు. ఎవరైనా సభలు సమావేశాలు పెట్టుకోండి.. ఎవరికీ అభ్యంతరాలు లేవన్నారు. కానీ దిగజారి మాట్లాడితే.. అదేవిధంగా దిగజారి మాట్లాడవలసివస్తుందన్నారు.

Advertisement

Next Story