రెడ్యానాయక్ తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి

by Shiva |
రెడ్యానాయక్ తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి
X

మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్

దిశ, ఇల్లందు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన రెడ్యానాయక్ తన వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మల్లు రవి డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇల్లందు వచ్చిన సందర్భంగా స్థానిక రాజీవ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ కవిత భూదందాలు, రెడ్యానాయక్ కొడుకుల బెల్లం దందా, రెడ్యానాయక్ గడీల పరిపాలన రేవంత్ రెడ్డి కొత్తగా సృష్టించి చెప్పింది ఏమి లేదన్నారు. ఈ విషయంపై ఇప్పటికే మీడియా కోడై కూసిందని ఆయన అన్నారు. రెడ్యానాయక్ కు సర్పంచ్ నుంచి మంత్రి వరకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, కన్న తల్లి లాంటి పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్లారన గుర్తు చేశారు. అలాంటి, పార్టీ పీసీసీ అధ్యక్షుడిపై రెడ్యా నాయక్ విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. రెడ్యానాయక్ ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. రెడ్యా నాయక్ వ్యాఖ్యలు ఆర్టీఐ యాక్ట్ ను అవమానించేలా ఉన్నాయని వారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో సిట్టింగ్ జడ్జి లేకపోతే స్థానిక కలెక్టర్ తో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రెడ్యానాయక్, ఆయన కూతురు కేసీఆర్ దగ్గర కట్టు బానిసల్లా పనిచేస్తున్నారని తెలిపారు. ఎస్టీల 12 శాతం రిజర్వేషన్ పై జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed