- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈసీకి కంప్లైంట్ చేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి..
దిశ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల బంధం ఫెవికాల్ లాంటిదని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పై ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాలు, నివాస గృహాలలో ఏకధాటిగా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు. తాను నామినేషన్ దాఖలు చేయనున్న అని తెలిసి కుట్ర పూరిత కోణంలో, నామినేషన్ అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు, కుట్రలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.
నాకుముందుగానే తెలుసు, దర్యాప్తు సంస్థల ద్వారా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తన నామినేషన్ ఘట్టాన్ని ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో దర్యాప్తు సంస్థ ద్వారా ఈ సోదాలు, తనిఖీలు చేస్తున్నారంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంని చూపిస్తోందని అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు చేస్తున్న నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.