- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు కంట్లో కారం…
దిశ, ఏన్కూర్: దళారి వ్యవస్థతో రైతు కుదేలవుతున్న పరిస్థితి. మిర్చికి ఖమ్మం మార్కెట్ జెండా పాట... ఒక విధంగా ఉంటే ఏన్కూర్ లోకల్ మార్కెట్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్న వైనం. రైతులు ఇదేమని అడిగితే... మీకు ఇష్టం ఉంటే అమ్మండి లేదా మీ సరుకు తీసుకుని వెళ్ళండి అంటూ దళారీలు పెత్తనం చేస్తున్నారు. చేసేదిలేక, ఎంతోకొంత రేటుకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సంవత్సరం వానలు సరిగా పడక, మిర్చి అనేక వైరస్ రోగాల బారిన పడి నష్టపోయినట్లు, నల్లి రోగం వల్ల ఎక్కువ నష్టపోయినట్లు రైతులు తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఫలితం మాత్రం తగ్గడం లేదని, చివరికి అప్పులే మిగులుతున్నాయని కొందరు రైతులు అంటున్నారు. మిరపకాయ కళ్ళాంలో ఎక్కువ శాతం తాలుకాయిలు వల్ల కొంత నష్ట పోయినట్టు తాలు కాయలకు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మిర్చి పంటల్లో సగ భాగం అప్పలకు, పురుగుల మందుల షాపులకు మిగిలింది సగభాగం కూలీలకే సరిపోతుందని రాయల నరసింహారావు ఆదర్శ రైతు (జన్నారం) అన్నారు. మధ్య దళారీలు దోపిడీని అరికట్టాలని ఎంతోమంది మంత్రులు చెబుతున్నప్పటికీ దళారుల చేతిలో రైతు ఎప్పుడు మోసపోతూనే ఉన్నారని అన్నారు. మార్కెట్లో ఎక్కువగా సిండికేట్ వ్యాపారం జరుగుతుందని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారులు, నాయకుల పై ఉందని, లోకల్ మార్కెట్‌లో వ్యాపారస్తులు మిర్చి ధరలు పూర్తిగా తగ్గిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తారని, అప్పుల బాధలు తట్టుకోలేక దిక్కుతోచని పరిస్థితుల్లో వ్యాపారస్తులు చెప్పిన విధంగా అమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మాకు విత్తనాలకు, ఎరువులకు, కూలీలకు, అన్నీ కలిపి రెండు నుంచి మూడు లక్షల వరకు ఖర్చు వస్తుందని, దీని దృష్టిలో పెట్టుకొని అయినా లోకల్ మార్కెట్‌లో గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులను రైతులు కోరుతున్నారు.