కిన్నెరసాని వాగులో చిక్కుకున్న వ్యక్తులు క్షేమం

by Sridhar Babu |
కిన్నెరసాని వాగులో చిక్కుకున్న వ్యక్తులు క్షేమం
X

దిశ, పాల్వంచ : పాల్వంచ దంతెలబోర వద్ద కిన్నెరసాని వాగులో గురువారం చిక్కుకుపోయిన వ్యక్తులకు బయటకు తీసుకొచ్చేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ప్రత్యేక డ్రోన్ ను వినియోగించి ఆహారపదార్థాలు, మంచినీటి విజయవంతంగా అందజేశారు. బుధవారం పశువులను కాసేందుకు వెళ్లిన ఏడుగురు వ్యక్తుల్లో ఆరుగురు తిరిగి క్షేమంగా బయటకు తీసుకు రాగా జారే సాయి ఒకరు గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ కోసం ఈరోజు ఐదుగురు వెళ్లగా ఆ సమయంలో కిన్నెరసాని గేట్లు ఎత్తగా వారు సైతం వాగు మధ్యలో చిక్కుకుపోయారు.

వారందరికీ మొదట డ్రోను సహాయంతో ఆహారం, మంచినీటిని అందజేశారు. వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే జిల్లా కలెక్టర్ స్పందించి కిన్నెరసాని, కేటీపీఎస్ అధికారులతో మాట్లాడి కిన్నెరసాని ప్రవాహం ఇన్ఫ్లో,ఔట్ ఫ్లో అంచనా వేసి గేట్లు దించాలని సూచించారు. అధికారులు వెంటనే స్పందించి గేట్లు దించడంతో నీటి ఉధృతి తగ్గడంతో వారందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ఈ విషయం మొదట తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకొని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు మధు, దామోదర్ రావు, పాల్వంచ తహసీల్దార్, సీఐలు వాగులో చిక్కుకున్న వారు బయటకు వచ్చేంతవరకు నిరంతరం పర్యవేక్షించారు.

Advertisement

Next Story