- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ ఇసుక రవాణా పై రవాణా శాఖ ఉక్కుపాదం..
దిశ, వైరా : గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు యదేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా పై వైరా రవాణాశాఖ ఉక్కుపాదం మోపింది. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా ఇసుకఅక్రమ రవాణా జరుగుతున్నా ఇక్కడి రవాణా, పోలీస్ ఇతరశాఖలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వైరా రవాణాశాఖ అధికారి బాదావత్ శంకర్ నాయక్ ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఏపీ సరిహద్దుల్లోని బోనకల్ వద్ద అర్ధరాత్రి వేళ తనిఖీలు చేపట్టి ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా వస్తున్న ఇసుక లారీలను సీజ్ చేశారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలను సోమవారం వైరాలోని రవాణాశాఖ కార్యాలయంలో ఎంవీఐ శంకర్నాయక్ వెల్లడించారు.
ఏపీ నుంచి తెలంగాణలోకి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ రవాణా అవుతుందని తెలిపారు. బోనకల్ చ్పెస్టు వద్ద రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తెలంగాణలోకి వస్తున్న ఐదు ఇసుక లారీలను సీజ్ చేసి బోనకల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఒక్కో లారీకి రూ.లక్ష చొప్పున ఐదు లారీలకు రూ.ఐదులక్షలు జరిమానా విధించారు. ఏపీ నుంచి ప్రతినిత్యం భారీ లారీల ద్వారా ఇసుక అక్రమ రవాణా అవుతున్న విషయాన్ని గుర్తించిన రవాణాశాఖ నిఘా పెట్టి తెలంగాణ చెక్పోస్ట్ వద్ద సీజ్ చేశారు. ఇసుక రవాణాకు పూర్తిస్థాయి అనుమతి పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించినా, సామర్ధ్యానికి మించిన బరువుతో వచ్చినా కఠిన చర్యలు తీస కుంటామని శంకర్ నాయక్ హెచ్చరించారు.