- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్మపేట పోలీస్ స్టేషన్ ముందు హై టెన్షన్..
దిశ, దమ్మపేట : దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ఉదయం అరగంట సేపు పాటు హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. దమ్మపేట మండల కేంద్రానికి చెందిన ఫాతిమా అనే మహిళకు కొత్తగూడెంకు చెందిన అజ్మత్ తో పదేళ్ల క్రిందట వివాహం జరిగింది. నెల రోజుల క్రిందట కుటుంబ మనస్పర్థల కారణంగా దమ్మపేటలోని పుట్టింటికి ఫాతిమా చేరింది. గత నెలరోజులుగా మహిళ ఫాతిమా తనకు న్యాయం చేయాలని కోరుతూ దమ్మపేట పోలీస్ స్టేషన్ లో అత్తింటివారి పై ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ దమ్మపేట పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట దమ్మపేట - పాల్వంచ ప్రధాన రహదారి పై బైఠాయించి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించింది. ఈ క్రమంలో మహిళ తల్లి మైబు తన ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
దీంతో అక్కడే ఉన్న మహిళ పోలీసులు వెంటనే గమనించి బాధిత మహిళ తల్లిని సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు బాధిత కుటుంబాన్ని సముదాయించే ప్రయత్నం చేసిన చాలా సేపటి వరకు బాధిత కుటుంబ సభ్యులు రోడ్డు పై కూర్చొని రోదిస్తూ ధర్నా చేస్తూనే ఉన్నారు. ఈ వివాదంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒత్తిడి కారణంగానే పోలీసులు తమ ఫిర్యాదులను పట్టించుకోవటం లేదని, పోలీసులు రౌడీ షీటర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పాట్ కు చేరుకున్న దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి రాస్తారోకో విరమించాలని, వెంటనే అత్తింటి వారి పై కేసు నమోదు చేస్తానని హామీ ఇవ్వడంతో, కుటుంబ సభ్యులు రాస్తారోకో ను విరమించారు.