- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
rainy season : ఆ గ్రామ ప్రజలకు వ్యాధులు వచ్చాయో.. అంతే సంగతి..
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల శ్రీరాంపురం ఎస్టీ కాలనీ రోడ్డు మార్గం సరిగా లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామస్తులు బాధపడుతూ జీవిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే దారి అధ్వానంగా తయారౌతుంది. మోకాళ్ల లోతు బురదలో వాహనాలు ఏమి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. సోమవారం ఆ కాలనీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళకు ఆరోగ్య పరిస్థితి బాగాలేక కావడిపైనే ఒక మూడు కిలోమీటర్లు మోసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్సై రాజేష్ అక్కడికి చేరుకొని అంబులెన్స్ పిలిపించి మహిళను అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
త్వరగా చికిత్స అందేలా చూశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సారపాక ఎస్టీ కాలనీలో గత 30 సంవత్సరాల పై నుండే ఇక్కడ నివసిస్తున్నామని, ఓట్లు అడగడానికి మాత్రమే రాజకీయ పార్టీ నాయకులు వస్తారే తప్ప, మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ఎంతో మంది సమయానికి ఆసుపత్రికి వెళ్లలేక మార్గమధ్యలోనే చనిపోతున్నారని, మాకు రోడ్డు మార్గం వేయాలని ఎస్సై రాజేష్ కి మొరపెట్టుకున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు మార్గం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.