- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశేష ప్రజా ఆదరణ పొందిన పత్రిక ‘దిశ’ : సత్తుపల్లి ఎమ్మెల్యే
దిశ,సత్తుపల్లి : నిరంతరం ఎప్పుడు వార్తలు అప్పుడే శరవేగంగా ప్రింట్ మీడియా క్రెడిబిలిటీ తో సోషల్ మీడియా వేగంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందిన పత్రికలలో దిశ దినపత్రిక ఒకటని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్యే స్వగృహంలో 'దిశ' దిన పత్రిక క్యాలెండర్ 2025 ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పత్రికా రంగంలో ఆదర్శంగా ఖచ్చితమైన సమాచారాన్ని శరవేగంగా పాఠకులకు చేరవేయడంలో మిగతా పత్రికల కంటే దిశ దినపత్రిక అగ్రగామిక నిలిచిందని సోషల్ మీడియా వేగంతో డైలీ 4 డైనమిక్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ తో విశేష పాఠకుల ఆదరణ పొందుతూ పత్రిక రంగంలో రారాజు గా నిలిచిందని ఆమె తెలిపారు.
లక్ష్య సాధన దిశగా "దిశ" దిన పత్రిక ప్రయాణం కొనసాగాలని దిశ దినపత్రిక యాజమాన్యానికి సిబ్బందికి ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, దిన దిన ప్రవర్థమానంలో విశేష ప్రజాదరణ పొందుతూ పత్రికలలో రారాజుగా అగ్ర స్థానంలో నిలిచిన పత్రిక దిశ దినపత్రిక అన్నారు. దిశ దినపత్రిక యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు కె.సుధాకర్, అనిల్, కరుణాకర్, జీ వెంకటేశ్వరరావు, వెంకటాచారి, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదె చెన్నకేశవ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎండి కమల్ పాషా, నరుకుళ్ళ అప్పారావు,ఇమ్మనేని ప్రసాద్, బత్తుల భరత్, దిలీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.