సినిమా హీరోల డ్యాన్సును తలపించిన ఎమ్మెల్యే నృత్యం..

by Sumithra |
సినిమా హీరోల డ్యాన్సును తలపించిన ఎమ్మెల్యే నృత్యం..
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైరాలో నిర్వహించిన సాగునీటి దినోత్సవం వేడుకల్లో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ డప్పుకొట్టి, గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ముందుగా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ట్రాక్టర్ల ర్యాలీను ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో డప్పువాయిద్యాలు, గిరిజన మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే రాములు నాయక్ డప్పు కళాకారులతో కలిసి డప్పు కొట్టారు.

అనంతరం బిందెలు ఎత్తుకున్న గిరిజన మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. బూట్లు ధరించి, కళ్ళజోడు పెట్టి మెడలో ముదురు ఆకుపచ్చ రంగు టవల్ వేసుకుని ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన నృత్యాలు సినిమా హీరోల డ్యాన్సులను తలపించాయి. ఎమ్మెల్యే డప్పుకొట్టి గిరిజన మహిళలతో నృత్యాలు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు, రైతుల్లో ఉత్సాహం మరింత ఉరకలెత్తింది.

Advertisement

Next Story