- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Uttam Kumar Reddy : 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం
దిశ, వైరా : 2026 ఆగస్టు 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరా లోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పై కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ నే ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుల శ్రమ చెమట రక్తంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని వివరించారు. ప్రతి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదన్నారు. యూపీఏ హయాంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు నాలుగేళ్లలో విడతల వారీగా లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు పేరుతో గత పదిహేళ్లుగా 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 77 కోట్లతో లింకు కాలువను ఏర్పాటు చేసి మూడు పంప్ హౌస్ల ద్వారా గోదావరి జలాలను కృష్ణ ఆయకట్టుకు అనుసంధానం చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు రఘురామిరెడ్డి, బలరాం నాయక్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.