ఘనంగా మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు

by Disha News Web Desk |
ఘనంగా మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు
X

దిశ‌,ఖ‌మ్మం : తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ వసంత లక్ష్మీల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం(రాజమండ్రి) గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద ఖమ్మం నగర తెరాస యువజన విభాగం అధ్యక్షుడు, సుడా పాలకవర్గ సభ్యుడు దేవభక్తుని కిషోర్ బాబుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి మంత్రి పువ్వాడకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బత్తుల మురళీ ప్రసాద్, పైడిపల్లి సత్యనారాయణ, కూరాకుల వలరాజు, బిక్కసాని జేశ్వంత్, పులిపాటి ప్రసాద్, కూర్ర భాస్కర్ రావు, మోతారపు సుధాకర్, అంజి రెడ్డి, సిరిపురపు సుదర్శన్, శిద్దారెడ్డి పవన్ రెడ్డి, రామోజీ, రాము, మధు, చిరుమామిళ్ల రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story