- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Komatireddy : రాష్ట్ర అభివృద్ధి ఒక్క సీఎం రేవంత్ రెడ్డితోనే సాధ్యం
దిశ,మణుగూరు/అశ్వాపురం : దేశానికి ఎందరో మహనీయుల పోరాటాల ఫలితమే ఈ 78వ స్వాతంత్ర్య దినోత్సవం అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.గురువారం అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు గ్రామంలోని సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌస్ ను పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు,ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం పంపు హౌస్ స్విచ్ ఆన్ చేశారు.తదనంతరం గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం,నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమని ఆయన కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతుల కష్టసుఖాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులందరి సమక్షంలో సీతారామయ్య ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించడం దీంట్లో జిల్లా మంత్రిగా తనను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.దీని ద్వారా రైతులందరికీ సాగునీరు అందుతుందని తెలియజేశారు.ఈ ప్రాజెక్టును ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు.
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద పైకి వచ్చే మూడు లక్షలు కాకుండా కొత్త ఆయకట్టు కట్టడానికి 10 వేల కోట్లు వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశామని,జిల్లాలోని రైతుల పంట పొలాలకు ప్రతి ఎకరానికి నీరు అందించడానికి ఈప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.రైతులకు 15 ఆగస్టు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నామన్నారు.రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు.దేశ చరిత్రలో 30 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు పగటి వేశగాళ్ళు వాళ్ళ మాటలు నమ్మొద్దని ప్రజలు సూచించారు.అధికారం పోయేసరికి పిచ్చెక్కి రోడ్ల మీద ప్రాజెక్టు పేరుతో నీతిమాలిన రాజకీయం చేస్తున్నారన్నారు.ఇంకా ప్రజలు బీఆర్ఎస్ నమ్మే స్థితిలో లేరని చెప్పుకొచ్చారు.రాష్ట్ర అభివృద్ధి ఒక్క రేవంత్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని ప్రజలకు గుర్తు చేశారు.రైతులను కాంగ్రెస్ ఎప్పుడు మోసం చేయదని నొక్కి చెప్పారు. ఈకార్యక్రమంలో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు,ఇరిగేషన్ డిఇ మస్తాన్ రావు,అశ్వాపురం తాసిల్దార్ స్వర్ణ,మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి,పినపాక తాసిల్దార్ సూర్యనారాయణ,ఇరిగేషన్ శాఖ డీఈలు,ఏఈలు తదితరులు పాల్గొన్నారు.