కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ఆగం..నరాల సత్యనారాయణ

by Sumithra |
కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ఆగం..నరాల సత్యనారాయణ
X

దిశ, దమ్మపేట : కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ఆగమయిందని తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర అద్యక్షుడు నరాల సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట తెలంగాణ రక్షణ సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సూర్యనారాయణ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించి పలువురికి కండువాలు కప్పి తెలంగాణ రక్షణ సమితి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం నరాల సత్యనారాయణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని, నీళ్లు నిధులు, నియామకాల అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయిందని అన్నారు. తెలంగాణ రక్షణ సమితి రాష్ట్రంలోని అన్నీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో పోటిచెయబోతుందని, తెలంగాణ ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ స్థాపించామని తెలిపారు. అనంతరం తెలంగాణ రక్షణ సమితి పార్టీ 88 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర బీసీ కన్వీనర్ బెక్కం పాపారావు, యువజన అధ్యక్షుడు సయ్యద్ ఫిరోజ్, బెక్కం సాయి నాయకులు, కొత్తూరి శంకర్, ఎండీ సలీం, ఇటుకుల మాధవి, రాగం కుసుమ, పూణెం సీత, పార్వతి, షేక్ సమిమ్, దుర్గా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed