- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక
దిశ, మణుగూరు: మణుగూరు మండలం లోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. సోమవారం సంఘ కార్యాలయంలో 50 మందితో ఎన్నికల గురించి చర్చలు జరిపారు. అనంతరం కాపు సంఘ సభ్యులు మండల అధ్యక్షుడిగా కృష్ణమోహన్, మండల కార్యదర్శి గా గాండ్ల సురేష్, మండల కోశాధికారిగా బొమ్మ రాత ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే యూత్ మండలి అధ్యక్షుడిగా మేడ నాగేశ్వరావు, కార్యదర్శి గా చందు పూజారి, కోశాధికారిగా గాండ్ల మల్లయ్య ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. మున్నూరు కాపు సంఘం కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. సంఘ అభివృద్ధి కోసం తొర్పడుతమని వాగ్దానం చేశారు. మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షుడు ఎడవల్లి వెంకటయ్య, వలసల వెంకటరామారావు, ఆవుల కనకయ్య, కుర్రి నాగేశ్వరావు, రామ్మోహన్, శ్రీనివాస్, రమణ, బడే రామ్మోహన్, నాగేశ్వరావు, సారంగపాణి, పూర్ణచంద్రరావు, పసునూరు రమేష్, ఏనుగు శ్రీనివాస్, తంతరపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.