ఘనంగా తాటి మహాలక్ష్మి ప్రధమ వర్ధంతి..

by Sumithra |
ఘనంగా తాటి మహాలక్ష్మి ప్రధమ వర్ధంతి..
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు కుమార్తె డాక్టర్ తాటి మహాలక్ష్మి ప్రధమ వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని కీ"శే" డాక్టర్ తాటి మహాలక్ష్మీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో చండ్రుగొండ జడ్పీటీసీ కొనగళ్ళ వెంకటరెడ్డి, డాక్టర్ తాళ్ల వెంకటరావు, తుళ్లూరు బ్రహ్మయ్య‌, బూర్గంపాడు జడ్పీటీసీ దంపతులు కామిరెడ్డి శ్రీలత రెడ్డి -రామకొండారెడ్డి, సోయం వీరభద్రం, కట్రం స్వామి, ఆలపాటి రాము, ఆలపాటి ప్రసాద్, పైడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, మొగల్పు చెన్నకేశవ, అంకిత మల్లికార్జునరావు, సుంకపల్లి వీరభద్ర రావు, పానుగంటి సత్యం, మురహరి రాంబాబు, అత్తలూరు వెంకట రామారావు, తాండ్ర ప్రభాకర్ రావు, పేడేటి నరసింహరావు, భీముడు నాయక్, చెరుకు రవి, పెద్దాపురం నాగరాజు, చుండ్రు విజయ్, రమణ తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed