- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AEO : తప్పయింది.. ఈ ఒక్కసారి క్షమించండి..
దిశ, వైరా : తప్పయింది.. ఈ ఒక్కసారికి క్షమించండి. నేను ఈ ప్రాంతానికి కొత్త. ఇటీవల ఇక్కడ ఉద్యోగంలో చేరాను. ఏఈవోల తప్పిదం వల్లే అర్హులైన రైతులకు పంట నష్టపరిహారం అందలేదు. ప్రస్తుతం పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించినా ప్రయోజనం లేదు. భవిష్యత్తులో ఎలాంటి తప్పిదాలు జరగనివ్వనని వైరా మండల వ్యవసాయ అధికారి మంజుఖాన్ రైతులకు బుజ్జగించి సర్ది చెప్పారు. వైరా మండలంలో పంట నష్టపరిహారంలో జరిగిన అవకతవకల పై ఇటీవల దిశ దినపత్రికలో పలు వార్తా కథనాలు ప్రచరితమయ్యాయి. దీంతో పంటనష్ట పరిహారం అందని అర్హులైన పలువురు రైతులు మంగళవారం వైరా మండల వ్యవసాయ కార్యాలయానికి వచ్చి అధికారులను ప్రశ్నించారు. భారీ వర్షాలకు తమ పొలాలు నీట మునగటంతో పాటు కోతకు గురై గండ్లు పడిన ఏ ఈఓలు కనీసం పరిశీలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పంటలను కోల్పోయి మరల రెండోసారి పంటలను సాగు చేస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ఒక దశలో రైతులు అధికారుల పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో ఏవో మంజు ఖాన్ రైతులకు సర్ది చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఒక్కసారికి తప్పయింది. మమ్మల్ని క్షమించండి భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు లేకుండా చూస్తామని రైతులను ఏవో వేడుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరిగితే మీరు ఏదైనా చేసుకోవచ్చని రైతులకు ఆయన తెలిపారు. తాను ఇప్పటి నుంచి రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని పేర్కొన్నారు. ఏవో ఒకింత తీవ్ర ఆవేదనతో రైతులను వేడుకోవడంతో బాధిత రైతులు శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వర్షానికి నష్టం వాటిల్లిన తమ పంటలను నష్టపరిహారం అందలేదని రైతులు వ్యవసాయ కార్యాలయానికి వస్తే అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ఏవో రైతులను బుజ్జగించటం పలు విమర్శలకు దారితీస్తుంది.