Khammam Collector : ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి..

by Aamani |
Khammam Collector : ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి..
X

దిశ, ఖమ్మం : ప్రజావాణి లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్, పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలో చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో మండల, గ్రామ పరిధిలో సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పెండింగ్ పై సమీక్ష చేయాలని ఆయన అన్నారు. వచ్చే శుక్రవారం కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగినులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం, అందరూ ఉద్యోగులకు ఎథిక్స్ పై అవగాహన కల్పించి, ప్రజలతో అధికారులు, సిబ్బంది ప్రవర్తన పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం రాజేశ్వరి, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed