- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
quarries : బినామీ పేర్లతో ‘బడా బిజినెస్’!
దిశ, కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ మాఫియా కోరలు చాచింది. బినామీల పేర్లతో భూగర్భాన్ని చీలుస్తూ బడా బిజినెస్ చేస్తున్నది. అయితే అధికారులతో మిలాఖత్ అయి పన్నులకు ఎగనామం పెడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. సంపన్న వర్గాలకు చెందిన కొంతమంది గిరిజనుల పేర్లతో అక్రమ మైనింగ్ దందాకు తెరలేపినట్లు తెలుస్తున్నది. రెన్యువల్ చేసుకోకుండానే పరిమితికి మించి తవ్వకాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి బ్లాస్టింగులు చేస్తూ వివిధ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో మాఫియా ఇష్టారాజ్యం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది.
రూ. 332 కోట్ల పెనాల్టీ పెండింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 క్వారీలు నడుస్తున్నాయి. అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి రూ. 332 కోట్ల పెనాల్టీ విధించారు. అయితే ఆ పెనాల్టీలను కోర్టుల్లో సవాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ మైనింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి రావాల్సిన రూ. వేల కోట్ల ఆదాయానికి గండి పడుతున్నది. ఒక క్వారీ నిర్వహించాలంటే రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మైనింగ్, పోలీస్, పొల్యూషన్ కంట్రోల్ అనుమతులు పొందవలసి ఉంటుంది. కానీ క్వారీ నిర్వాహకులు సరైన అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని అనేక ప్రజా సంఘాల నేతలు ఆందోళనలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
సిండికేట్ గా మారి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వారీ యజమానులంతా సిండికేట్ గా మారారు. ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులకు ఎగనామం పెడుతూనే, బినామీల పేర్లతో నడిచే ఈ దందాకు అడ్డువస్తారనుకున్న అధికారులను బేరసారాలతో లోబర్చుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. కొందరు అధికారులు సైతం వీరి అక్రమాలను చూసీచూడనట్లు ఉంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతున్నది.
అడ్డుపడితే ఒక్క ఊరికి రూ. 60 లక్షలు?
పాల్వంచ మండలం తోగూడెంలో క్వారీ నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిత్యం కంకరతో భారీ వాహనాలు ఆ గ్రామం నుంచి ప్రయాణించడంతో గ్రామస్తులు అనేక మార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బ్లాస్టింగులతో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రజాసంఘాల నాయకులు అనేకమార్లు ఆందోళనలు చేశారు. దీంతో క్వారీ నిర్వాహకులు కొందరు గ్రామస్తులపై అక్రమంగా కేసులు నమోదు చేశారనే ఆరోపణలున్నాయి. అయితే క్వారీ నిర్వాహకులు ప్రజాసంఘాలు, గ్రామ పెద్దలకు ప్రతి ఏటా రూ. 60 లక్షలు పంచుతున్నామని బాహాటంగా చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
చర్యలు తీసుకుంటాం.. దినేశ్, మైనిండ్ ఏడీఈ
నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను జిల్లాకు కొత్తగా వచ్చాను. ప్రస్తుతం రూ. 15 కోట్ల వరకు పెనాల్టీలు వసూలు చేశాం. మా శాఖకు సరిపడా స్టాఫ్ ఉన్నట్లయితే.. పని ఇంకాస్త వేగవంతం చేస్తాం.