- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్.కే.టి భవంతుల నిర్మాణానికి అక్రమంగా ఇసుక రవాణా..
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : వాగు ప్రవాహిత ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఎస్కేటీ అపార్ట్మెంట్ల నిర్మాణానికి దొడ్డి దారిన ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కూలీలైన్ సమీపంలోని మొర్రేడువాగుకు కూత వేటు దూరంలో నిర్మిస్తున్న ఎస్కేటి అపార్ట్మెంట్ నిర్మాణానికి పక్కనే ఉన్న ముర్రేడు వాగులోని ఇసుకను తెల్లవార్లు తరలిస్తూ పేకమేడల నిర్మాణాలను చేపట్టారు. స్థానికంగా ఉన్న ఇద్దరు చోటామోటా ప్రజా ప్రతినిధులతో డీల్ కుదుర్చుకొని అతి తక్కువ ధరలో వాగులోని ఇసుకను రేయింబవలు ట్రాక్టర్లతో తెప్పించి తమ నిర్మాణాలకు వాడుకుంటున్నారు.
అడ్డుపడతారనుకున్న అధికారులకు ముడుపులు ముట్టచెప్పి ఇసుక దొంగతనానికి పాల్పడుతున్నారు. అతితక్కువ ధరలకే అపార్ట్మెంట్ అందిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న ఎస్కేటీ కనీసం ఇసుకలోను నాణ్యత పాటించడం లేదని ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. ఒక్క ఇసుకవ్యవహారంలోనే నాణ్యత పాటించలేని వీరు నిర్మాణానికి వాడుతున్న సిమెంట్, ఐరన్, ఇటుక వ్యవహారాల్లో ఇంకెంత పొదుపుగా వ్యవహరిస్తున్నారో అన్నఅనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.