మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పై కౌన్సిలర్ భర్త రౌడీయిజం

by Javid Pasha |   ( Updated:2023-05-31 07:39:40.0  )
మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పై కౌన్సిలర్ భర్త రౌడీయిజం
X

దిశ, ఇల్లందు: ఇల్లందు మున్సిపాలిటీ ఐదో వార్డ్ కౌన్సిలర్ యలమందల వీణ భర్త యలమందల వాసు ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండ్ల రాధాకృష్ణ కు ట్రేడ్ లైసెన్సు అప్లై చేస్తే ఇవ్వలేదని మున్సిపాలిటీ ఆఫీసు వెళ్లి అతని ఇష్టం వచ్చినట్లు బూతు పురాణం తిడుతూ, బయటికి రా అవసరమైతే నువ్వు నేను చూసుకుందాం అంటూ సవాళ్లు విసిరాడు. వాస్తవానికి ఆ కౌన్సిలర్ భర్త పొదిలి కళావతి పేరు మీద 2020-2023 ట్రేడ్ లైసెన్స్ ఇవ్వవలసిందిగా అప్లై చేసుకున్నారు. కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ బండ్ల రాధాకృష్ణ 2022 మే నెలలో ఇల్లందు శానీటీరి ఇన్స్పెక్టర్ గా బాధ్యతలను స్వీకరించాడు.

నేను లేని సమయంలో ఆ సర్టిఫికెట్ ఎలా ఇవ్వగలుగుతానని అనడంతో కౌన్సిలర్ భర్తకు చిర్రెత్తి అతనిపై ఇష్టం వచ్చినట్లు దూషించడం, రౌడీయిజం చేయడం అక్కడ జరుగుతున్న తతంగం చూస్తే ఆ అధికారిని కొట్టే విధంగా ఉండడంతో పక్కనున్న కౌన్సిలర్లు , అధికారులు అతని ఆపడం అది చూసిన శానిటరీ ఇన్స్పెక్టర్ నేను బతుకుతెరువు కోసం ఇల్లందు వచ్చి ఉద్యోగం చూస్తుంటే నేను ఇల్లందులో ఉద్యోగం చేయని సమయంలో సర్టిఫికెట్ ఇచ్చి నా ఉద్యోగాన్ని కోల్పోవాలా అని అతని కార్యాలయంలో కన్నీరు పెడుతున్న సన్నివేశం చూసి మున్సిపల్ అధికారులు అతనిని ఓదార్చిన తీరు సహ ఉద్యోగులను కంటతడి పెట్టించింది.

దిశ విలేఖరి శానిటరీ ఇన్స్పెక్టర్ ని సంప్రదించగా పొదిలి కళావతి పేరు మీద 2023 మే 15వ తారీఖున ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. కానీ కౌన్సిలర్ భర్త ఏప్రిల్2020-మార్చి 2023 వరకు పొదిలి కళావతి పేరు మీద ట్రేడర్స్ లైసెన్సు కావాలని అడగగా మున్సిపాలిటీ సంబంధించిన ప్రతి లైసెన్స్ ఆన్లైన్లో ఉన్నది, ఒకవేళ మీకు కావాలనుకుంటే గతంలో అనగా 2020 - 23 సంవత్సరాలలో వారు తీసుకున్న ట్రేడ్ లైసెన్స్ ఫీజు రశీదు నకలను పొందపరిస్తే పై అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని మర్యాదగా సమాధానం చెప్పడం జరిగిందన్నారు. 2020-2023 లో ట్రేడ్ లైసెన్స్ రసీదులు తీసుకున్న జవాన్ నీ సంప్రదించి అతని వద్ద వున్న రశీదు పుస్తకంలో వారి పేరు ఉంటే పై అధికారితో మాట్లాడి ఇప్పించే అవకాశం ఉందని సదరు కౌన్సిలర్ భర్తకు తెలపడం జరిగింది. కానీ ఆ కౌన్సిలర్ భర్త ఇంకా ఎన్ని రోజులు ఆగాలి రా అంటూ తనపై తిట్ల పురాణం అందుకున్నాడని తెలిపారు.

Advertisement

Next Story