రిమోట్ ఎమ్మెల్యే కావాలా.. రియల్ ఎమ్మెల్యే కావాలా : ఉప్పల వెంకటరమణ

by Sumithra |
రిమోట్ ఎమ్మెల్యే కావాలా.. రియల్ ఎమ్మెల్యే కావాలా : ఉప్పల వెంకటరమణ
X

దిశ, దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గం పచ్చగా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావును గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉప్పల వెంకటరమణ అన్నారు. శుక్రవారం దమ్మపేట మండల కేంద్రంలో మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, సాగు, తాగునీరు, ఐటీ సెక్టర్ గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. నాణ్యమైన 24 గంటలు విద్యుత్ ఇవ్వడంతో రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందాయని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీసి భూగర్భ జలాలు పెరిగాయని వచ్చేఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 11 వేల మందికి పోడుపట్టాలిచ్చి, 70 ఏళ్లుగా ఉన్న పోడు సమస్యను తీర్చగలిగారని అన్నారు.

అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నీతిమంతుడు, కల్మషం లేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుంటుందని, ప్రత్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గంలో గిరిజనులు, గిరిజనేతల మధ్య చిచ్చుపెట్టి పచ్చగా ఉన్న పేటలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడ్డారు. ప్రత్యర్థులను గెలిపించడం ద్వారా నియోజకవర్గం ఇద్దరు చేతుల్లోకి వెళ్లిపోతుందని, నియోజకవర్గ ప్రజలు రియల్ ఎమ్మెల్యే కావాలో, రిమోట్ ఎమ్మెల్యే కావాలో మీరే తేల్చుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు అందరూ పచ్చగా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చానాగేశ్వరరావును గెలిపించాలని కోరారు.

ఈనెల 13వ తేదీన బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ దమ్మపేటలో జరగబోతుందని అన్నారు. ఆ సభకు సుమారు 50వేల మంది రాబోతున్నారని, నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, దమ్మపేట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు దొడ్డ రమేష్, తూతా నాగమణి, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed