భద్రాచలంలో హనీ ట్రాప్ కేసు నమోదు

by Sridhar Babu |
భద్రాచలంలో హనీ ట్రాప్ కేసు నమోదు
X

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణానికి చెందిన నాగమణి అనే 35 సంవత్సరాల వయసున్న మహిళ ఫోన్ చేసి పలువురు మగవాళ్లను ఆకర్షించి ఇంటికి పిలిపించుకొని రేప్ చేశావని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా, జైలుకు పంపుతా అని బెదిరిస్తూ డబ్బులు, వస్తువులను డిమాండ్ చేస్తూ ఉంది. ఈమెను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే మహిళ గతంలో కూడా కొందరిపై ఫిర్యాదు చేసింది. ఈ మహిళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. మంగళవారం ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు నాగమణి అనే మహిళపై కేసు నమోదు చేయడం జరిగింది. చాలా మంది పరువు పోతుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని, ఇంకెవరైనా బాధితులు ఉంటే భద్రాచలం పోలీసు వారిని ఆశ్రయించాలని కోరారు.



Next Story

Most Viewed