అసెంబ్లీ ఎన్నికల ముందు హై అలర్ట్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ

by karthikeya |
అసెంబ్లీ ఎన్నికల ముందు హై అలర్ట్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రతా బలగాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. జమ్మూకాశ్మీర్‌ (Jammu Kashmir)లోని నౌషెరాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన క్రమంలో నేపథ్యంలో వారిని మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వారి నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని, అయితే ఈ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉండడంతో సెర్చ్ ఆపరేషన్ (Search Operation) కూడా నిర్వహిస్తున్నామని భద్రతా బలగాలు పేర్కొన్నారు.

అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. జమ్మూకాశ్మీర్‌లో చొరబాట్లకు అవకాశం ఉందని నిఘా సంస్థలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి సమాచారం అందడంతో ఆర్మీ ఆదివారం రాత్రి నౌషేరాలోని లామ్ ప్రాంతంలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసింది. ఇది తెలియని ఇద్దరు ఉగ్రవాదులు భారత్‌ (India)లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే ఇది గమనించిన వెంటనే వారిపై భారత సైన్యం (Indian Army) కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో వారిద్దరూ అక్కడికక్కడే హతమయ్యారు. వారి వద్ద నుంచి 2 AK-47లు, ఒక పిస్టల్‌తో సహా భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నికల కోసం హై అలర్ట్:

కాగా.. జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు (370 Article Revocation) తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ రేఖ (LoC)లో వెంబడి 3 నెలలుగా భద్రతా బలగాలు తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దాదాపు 300 కంపెనీల పారామిలటరీ బలగాల (Paramilitary Forces)ను మోహరించి పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలోనే 2 వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమార్చింది. మొదటి ఎన్‌కౌంటర్ కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో జర్గగా.. ఆ ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ తర్వాత అదే ప్రాంతంలోని తంగ్‌ధర్ సెక్టార్‌లో మరో ఉగ్రవాది హతమైనట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ (Chinar Corps) వెల్లడించింది.

ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు (Jammu Karmir Assembly Elections 2024) జరగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.


Advertisement

Next Story