శాసన సభలో ప్రజాపాలనా దినోత్సవం

by karthikeya |
శాసన సభలో ప్రజాపాలనా దినోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ, శాసన మండలిలో ప్రజాపాలన దినోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. మరోవైపు బీజేపీ కూడా ఈ దినోత్సవాన్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోంది. కాాగా.. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును ఒక్కో పార్టీ ఒక్కోలా నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట అధికారికంగా వేడుకలను నిర్వహిస్తుంటే.. రాష్ట్ర సర్కారు ‘ప్రజాపాలన దినోత్సవం’ పేరిట నిర్వహిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మూడోసారి విమోచన వేడుకలను జరుపుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా సమైక్యతా దినోత్సవం పేరిట సెప్టెంబర్ 17న వేడుకలు నిర్వహించేది. కానీ ఈ ఏడాది చాలా సైలెంట్‌గా తెలంగాణ భవన్‌లో జెండా వందనం చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed