- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ప్రజాపాలన దినోత్సవం.. పబ్లిక్ గార్డెన్స్‌లో జెండా వందనం చేయనున్న సీఎం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న నిర్వహించే వేడుక రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ ‘విమోచన దినోత్సవం’ పేరుతో నిర్వహిస్తూ ఉంటే గత ప్రభుత్వం (బీఆర్ఎస్) ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరుతో నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుండగా వివిధ శాఖలకు చెందిన కార్యదర్శులు హాజరవుతున్నారు. పలు విభాగాల (హెచ్‌వోడీ) ప్రధాన కార్యాలయాల్లోనూ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఆఫీసర్లు ఆవిష్కరించనున్నారు. జిల్లాకేంద్రాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఇప్పటికే మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు షెడ్యూలు ఫిక్స్ అయింది. వివిధ పార్టీలు కూడా వాటి స్టేట్ ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా నిర్వహిస్తున్నందున సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతుండగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తదితరులు కూడా పాల్గొననున్నారు.