Revanth Reddy: మహాకవి కాళోజీ జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

by Ramesh Goud |
Revanth Reddy: మహాకవి కాళోజీ జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాకవి కాళోజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఉద్యమ కవి కాళోజీ నారాయణరావు ఫోటోను షేర్ చేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై "పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది." అని తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేసిన మహనీయుడు కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ రేవంత్ రెడ్డి ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా తెలంగాణ ప్రముఖ కాళోజీ నారాయణ రావు తన కవితలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలు ఊదాడు. అప్పట్లో ప్రభుత్వాన్ని ఎదిరించి గణపతి ఉత్సవాలు జరిపిన ఘనంగా జరిపించిన చరిత్ర ఉంది. ఆయన 2002 లో మరణించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కాళోజీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 09 ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక వరంగల్ లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి గుర్తింపునిచ్చింది. ఇక నేటి కవులు, సాహితీ వేత్తలు, కళాకారులకు నిలయంగా హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది.

Advertisement

Next Story