- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Seeds benefits : గింజలే కానీ.. లాభాలు బోలెడు!
దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం.. ఈ సందర్భంలో ఆరోగ్యంగా ఉండాలంటే డయాబెటిస్ పేషెంట్లు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే వాటిని ఎంచుకోవాలి. అలాంటి వాటిలో చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, నువ్వులు కూడా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
సన్ ఫ్లవర్ సీడ్స్
ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ -ఇ కలిగి ఉండటంవల్ల సన్ ఫ్లవర్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. డయాటిక్ పేషెంట్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటంవల్ల గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు.
చియా సీడ్స్
యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఫుల్లుగా ఉండే వాటిలో చియా సీడ్స్ ఒకటి. ఒమేకా -3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం మూలంగా జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది. ఇంకా వీటిలోని విటమిన్లు, ఫైబర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి సహాయపడతాయి.
అవిసె గింజలు
ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. కాబట్ట మధుమేహం ఉన్నవారు తింటే ఆరోగ్యానికి మంచిది. రోగ నిరోధక శక్తి పెరగడంలో సహాయపడతాయి. అలాగే ఇన్సులిన్ నిరోధకతను మెరుగు పరిచి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అధిక బరువు తగ్గడంలోనూ మేలు చేస్తాయి.
గుమ్మడి గింజలు
గుమ్మడి గిజంల్లో జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రక్తంలో చక్కర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ఆహారంలో భాగంగా తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుమ్మడి గింజల్లో హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నువ్వులు
యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. కాబట్టి నువ్వులు డయాబెటిస్ ఉన్నవారు తింటే మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. నువ్వుల్లో ఫైబర్, ఆరోగ్య కరమైన కొవ్వు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ఆరోగ్యానికి, అధిక బరువు తగ్గడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Sesame Seeds: నువ్వులు తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే