Dogs - Dreams: కుక్కలు ఇలాంటి కలలు కంటాయా? పెట్ లవర్స్‌కు సైతం ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు..

by Sujitha Rachapalli |
Dogs - Dreams: కుక్కలు ఇలాంటి కలలు కంటాయా? పెట్ లవర్స్‌కు సైతం ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనుషులు కలలు కంటారు. కొన్నిసార్లు అవి గుర్తుంటే.. మరికొన్ని మరిచిపోతాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో.. కలలు ఎందుకు వస్తాయో.. ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోగా.. మానవుల మాదిరిగానే కుక్కలు కూడా కలగంటాయని చెప్తుంది మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం. అంతేకాదు వాటి డ్రీమ్స్ నిజ జీవిత అనుభవాలతో ముడిపడి ఉన్నాయని అంటుంది.

కలలోకి జారుకునేందుకు పట్టే సమయం

కుక్కలు నిద్రపోవడం ప్రారంభించినప్పుడు.. వాటి శ్వాస లోతుగా, మరింత క్రమంగా మారుతుంది. స్లో వేవ్ స్లీప్ (SWS) అనుభవిస్తాయి. ఈ సమయంలో మానసిక ప్రక్రియలు మందగిస్తాయి. కానీ కండరాలు చురుకుగా ఉంటాయి. REM నిద్రలో ఉన్నప్పుడు సాధారణంగా నిద్రలోకి జారుకున్న 20 నిమిషాల తర్వాత కుక్కకు కలలు ప్రారంభమవుతాయి.

రోజూవారీ సంఘటనల రీకాలింగ్

కలలు కంటున్నప్పుడు, కుక్క శ్వాస నిస్సారంగా, క్రమరహితంగా మారవచ్చు. కండరాలు మెలితిప్పవచ్చు. కళ్లు మూసుకున్నా కనురెప్పల వెనుక కళ్లు వేగంగా కదలడం చూస్తుంటాం. ఈ దశలో కుక్కలు బంతులతో ఆడుకోవడం, పిల్లిని వెంబడించడం, వాటి యజమానులతో సమయం గడపడం గురించి కలలు కంటాయి. పగటిపూట జరిగినదంతా కలలో తిరిగి క్రియేట్ చేసుకుంటాయి.

బ్యాడ్ డ్రీమ్స్ సంకేతాలు

కుక్క అరుస్తుండటం లేదా మూలుగుతుండటం.. పీడకలని అనుభవిస్తున్నదనేందుకు సంకేతం. ఈ సమయంలో శ్వాస సక్రమంగా మారవచ్చు. అయితే బాధలో ఉన్న కుక్క అనుకోకుండా కాటువేయవచ్చు కాబట్టి వాటిని ఓదార్చడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. జర్నల్ ఆఫ్ వెటర్నరీ బిహేవియర్ ప్రకారం కుక్క నిద్రపోతున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దాదాపు 6% ప్రమాదాలు సంభవించాయి.

వయస్సు, పరిమాణంతో సంబంధం

కుక్కల పరిమాణం, వయస్సు వారి కలల ఫ్రీక్వెన్సీ, పొడవును ప్రభావితం చేయవచ్చు. పెద్ద కుక్కల కంటే కుక్కపిల్లలు ఎక్కువగా కలలు కంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పెద్ద జాతులతో పోలిస్తే చిన్న కుక్కలు తరచుగా కలగంటాయి. VCA యానిమల్ హాస్పిటల్స్ ప్రకారం.. ప్రతి 10 నిమిషాలకు డ్రీమ్స్ లో ఉంటాయి. అయితే లాబ్రడార్ రిట్రీవర్ ప్రతి 60-90 నిమిషాలకు ఒకసారి మాత్రమే కలలు కంటుంది.

Advertisement

Next Story