IIHT : హైదరాబాద్‌లో చేనేత ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం.. విద్యార్థులకు సీఎం స్కాలర్‌షిప్‌ల పంపిణి

by Ramesh N |
IIHT : హైదరాబాద్‌లో చేనేత ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం.. విద్యార్థులకు సీఎం స్కాలర్‌షిప్‌ల పంపిణి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ చేనేత భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్- నాంపల్లి లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ‘చేనేత అభయహస్తం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘నేతన్నకు చేయూత’ పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులు సీఎం విడుదల చేశారు. అదేవిధంగా ఐఐహెచ్‌టీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా, చేనేత రంగంలోని కొత్త పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని ఏర్పాటు చేశారు. ఐఐహెచ్‌టీ విద్యార్థులకు నెలకు రూ. 2,500 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

Advertisement

Next Story