- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న అనసూయ, జగపతి బాబు సినిమా..
దిశ, వెబ్ డెస్క్ : అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ ‘సింబా’ సినిమా. ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్స్ లో విడుదల అయి యావరేజ్ గా ఆడింది. సంపత్ నంది, రాజేందర్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితర నటీ నటులు నటించారు.
సింబా మూవీ ముఖ్య ఉద్దేశం అంటే.. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, చెట్లను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనే మెసేజ్ ని సెల్యులర్ మెమరీ అనే కొత్త దానిని మన ముందుకు తీసుకొచ్చి సస్పెన్స్ జానర్ లో చూపించారు. సింబా మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్, ఆహా సొంతం చేసుకుంది. ఒకే రెండు ఓటీటీలలో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమ్ అయి మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది.
ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో టాప్ 5లో ఉంది. థియేటర్లో అంతంతమాత్రంగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా కనిపిస్తే అనసూయ ఒక మంచి టీచర్ పాత్రలో కనిపిస్తూనే యాక్షన్ కూడా చించేసింది. కొత్త డైరెక్టర్ మురళి మనోహర్ సంపత్ నంది ఇచ్చిన కథని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించాడు. మొదటి మూవీతోనే దర్శకుడిగా విజయం సాధించాడు.