మార్నింగ్ ఆలస్యంగా టిఫిన్ చేసేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Anjali |
మార్నింగ్ ఆలస్యంగా టిఫిన్ చేసేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న పెద్దల మాటలో వంద శాతం వాస్తవం ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యూల్ కారణంగా తిండి మీద దృష్టి పెట్టడం లేదు. సరైన సమయానికి ఫుడ్ తీసుకోకుండా, వ్యాయామాలు చేయకుండా ఎంతో మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే మారుతున్న జీవనశైలి రీత్యా.. ఉరుకుల పరుకుల జీవితంలో ఫాస్ట్‌గా ఆఫీసుకెళ్లాలనే ఆరాటంతో మార్నింగ్ టిఫిన్ చేయడం మానేస్తున్నారు. కాగా ఈ అలవాటు ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమే తెచ్చిపెడుతుందంటున్నారు నిపుణులు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ వైద్యులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. మార్నింగ్ 8 గంటలకు అల్పాహారం తీసుకోకపోతే గుండె సమస్యతలు ఎక్కువగా వచ్చే చాన్స్ ఉందని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. మార్నింగ్ 8 గంటలకు టిఫిన్ చేసే వారితో పోల్చినట్లైతే 9 గంటలకు తినేవారిలో హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ తలెత్తే చాన్స్ 6 శాతం ఉందని తెలిపారు. అలాగే రాత్రి 9 గంటలకు డిన్నర్ చేసినా మహిళల్లో స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే అవకాశం 28 శాతం ఉందని వెల్లడించారు.

కాగా మార్నింగ్ 8, నైట్ 8 కల్లా టిఫిన్, భోజనం చేయడం ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా టిఫిన్‌ చేసే వారిలో మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా 1,03,312 మందిని పరిగణలోకి తీసుకొని వారి ఆహార అలవాట్లను విశ్లేషించారు. ఇందులో 9 గంటల తర్వాత అల్పాహారం తీసుకునే వారిలో టైప్ -2 డయాబెటిస్ ముప్పు అధికంగా ఉన్నట్లు తేలింది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed