- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులకు గజ్జల మల్లారెడ్డి పురస్కారాలు
దిశ, ప్రతినిధి కడప: ఆంధ్ర జ్యోతి, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు కె. శ్రీనివాస్, తెలకపల్లి రవిలకు గజ్జల మల్లారెడ్డి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయ బాధ్య ఉపకులపతి ఆచార్య కె కృష్ణారెడ్డి తెలిపారు. సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడంలో ఇరువురూ తమదైన శైలిలో ముందున్నారని అన్నారు. శ్రీనివాస్‌కు సాహిత్యంపై మంచి అభిరుచి ఉందని, అదే ఆయనను రచయితగా మార్చిందన్నారు. ఈయన రాసిన ‘తెలంగాణ సాహిత్య వికాసం (1900-1940 వరకు)’ ప్రసిద్ధ విమర్శ గ్రంథం. 1995–97 మధ్యకాలంలో ‘సంభాషణ’ కాలమ్ ద్వారా చేసిన రచనలు ఒక కొత్త వచన రచనా శైలిని సాహిత్యలోకానికి అందించాయని అన్నారు.
తెలకపల్లి రవి రాజకీయ విశ్లేషకుడిగా విశిష్ట గుర్తింపు పొందారని అన్నారు. స్ట్రెయిట్ టాక్ విత్ తెలకపల్లి అనే షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాత్రికేయులుగా పత్రిక రచయితగా మంచి గుర్తింపు పొందారని తెలిపారు.