సీఎం రమేశ్‌కు షాక్.. ప్రకంపనలు సృష్టిస్తున్న లేఖ

by Rani Yarlagadda |   ( Updated:2024-11-28 02:21:44.0  )
సీఎం రమేశ్‌కు షాక్.. ప్రకంపనలు సృష్టిస్తున్న లేఖ
X

దిశ, ప్రతినిధి విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు షాక్ తగిలింది. ఇటీవల జరిగిన రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌లో సభ్యులకు ఖరీదైన కానుకలు ఇవ్వడంపై బిహార్ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు సుదామ ప్రసాద్ ఎదురు తిరిగారు. గత అక్టోబర్ 31 నుంచి ఈ నెల 7 వరకూ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ నాయకత్వంలో స్టడీ టూర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది.

అయితే ఈ సందర్భంగా సభ్యులకు ఇచ్చిన కానుకల్లో ఒక గ్రాము బంగారం, వంద గ్రాముల వెండి ఉండడాన్ని సుదామ ప్రసాద్ గ్రహించారు. ప్రజాధనాన్ని ఇలా దుబరా చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆయనకు అందజేసిన గిఫ్ట్ ప్యాక్ను వెనక్కి పంపించేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, అధికారులు బస చేయడానికి ఫైవ్ స్టార్ హోటళ్లు వద్దని, ప్రజా సేవ చేయడానికి వచ్చాం గనుక ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయదంటూ ఎంపీ రమేశ్‌కు ఆయన లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనాలు సృష్టిస్తోంది.

Advertisement

Next Story
null