- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కళ్ల ముందే కన్న కొడుకు దుర్మరణం
దిశ, కోదాడ టౌన్: తండ్రి కళ్ల ఎదుటే కన్న కొడుకు దుర్మరణం పాలైన ఘటన రామాపూరం స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూచిపూడి తండాకు చెందిన లకావత్ నాగేశ్వర రావు కుమారుడు గోపీచంద్ (14) ఒంట్లో నలతగా ఉందంటూ స్కూల్ కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన లకావత్ చిన బాలు (50) గోపీచంద్ ను తీసుకొని కృష్టా జిల్లా బూదవాడు గ్రామానికి పని నిమిత్తం టీవీఎస్ మోపెడపై వెళ్తున్నారు.
ఈ క్రమంలో వారు రామాపూరం స్టేజీ వద్దకు రాగానే, వారికి గోపీచంద్ తండ్రి నాగేశ్వర రావు వారికి కలిశాడు. వారినిఎక్కడికి వెళుతున్నారని అడిగి.. త్వరగా రండి అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతూ వారి వైపు చూస్తుండగానే రామాపురం నుంచి నల్లబండ గుడెం వైపు వెళ్తున్న లారీ అతి వేగంతో టీవీఎస్ మోపెడ్ ను బలంగా ఢీకొట్టింది. అనంతరం లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గోపీచంద్, చినబాలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి నాగేశ్వరరావు కళ్లేదుటే కుమారుడిని కోల్పోవడం పలువురి కంటతడి పెట్టించింది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు చినబాలు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని అతని కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
- Tags
- road accident