- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రశాంతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలి
దిశ బ్యూరో, ఖమ్మం : కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలు వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు కారకులు కావద్దని ఖమ్మం నగర ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు కోరారు. మంగళవారం ఆయన ‘దిశ’తో మాట్లాడుతూ.. నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగర సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జనాలు రాత్రి 12 గంటల సమయంలో వేడుక జరుపుకునేందుకు రోడ్లపైకి వస్తుంటారని, ఎవరికి వారు ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని సూచించారు.
వేడుకను ఘనంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరపున తాము సూచిస్తున్నామని, అదే సమయంలో ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా పీస్ ఫుల్ గా జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి, ఎంజాయ్ చేస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిస్తూ ఉండేవారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీస్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున జనాలు గుమిగూడి ఉండకూడదని, యుతవ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యూసెన్స్ చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కూడళ్ల వద్ద పోలీసుల గస్తీ..
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జనాలు గ్యాదర్ అయ్యే కూడళ్ల వద్ద పోలీసుల గస్తీ పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఇల్లెందు క్రాస్ రోడ్, మమత రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, జెడ్పీ సెంటర్, పాత బస్టాండ్, కాల్వొడ్డు, చర్చ్ కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో చెక్ పోస్టు ఏర్పాటు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు. మద్యం మత్తులో కేకలు వేస్తూ ఎదుటివారికి ఇబ్బందులు కలిగిస్తూ న్యుసెన్స్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం సహించబోమన్నారు. వాహనాలను అజాగ్రత్తగా నడుపుతూ ఇతర ప్రాణాలకు హాని కలిగించే ప్రయత్నాలు చేయకూడదన్నారు.
లా అండ్ అర్డర్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు గస్తీ తిరుగుతూ పర్యవేక్షిస్తుందన్నారు. వైన్స్, బార్ షాప్స్ వద్ద కూడా నిఘా పెంచామని, మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా హైవే పై వెళ్లే వాహనాలను కూడా తనిఖీలు చేస్తామని, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని సూచించారు. రోడ్లపై టెంట్లు వేయడం, కేకులు కట్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. ఈవెంట్స్ ఆర్గ నైజర్స్ కూడా ఈవెంట్ల నిర్వహణ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.