రైతు స్థలంలో గ్రామ పంచాయతీ బావి..

by Aamani |   ( Updated:2025-03-13 07:13:26.0  )
రైతు స్థలంలో గ్రామ పంచాయతీ బావి..
X

దిశ, తిరుమలాయపాలెం: గ్రామ ప్రజల నీటి ఎద్దడి తీర్చడానికి,ఆ నాడు ఓ రైతు వ్యవసాయ భూమిలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీసిన బావి నుంచి..ఇప్పుడు ఆ రైతు ఫీజులు తీసి నీళ్లు బంద్ చేయడంతో గ్రామ ప్రజలంతా గురువారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ సిలార్ సాహెబ్ గోడు వినిపించారు.

అందుకు సంబంధించి భాదితులు తెలిపిన వివరాలు...తిరుమలాయపాలెం మండలంలోని తెట్టేలాపాడు గ్రామంలో, గతంలో 2003న ఊరి ప్రజల నీటి ఎద్దడి తీర్చేందుకు ఆ గ్రామానికి చెందిన ఏపూరి బాబు అనే రైతు వ్యవసాయ భూమిలో, ఒప్పందంతో నాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బావి తీయడం జరిగింది.అప్పటి నుంచి ఆ బావి ద్వారా గ్రామంలోని నీటి ఎద్దడి తీర్చడం జరుగుతుంది. కాగా ఇప్పుడు ఆ రైతు కుమారుడు అఖిల్,తాజాగా గ్రామ పంచాయతీ సిబ్బంది (పంప్ ఆపరేటర్) తో ఘర్షణకు దిగి దాడి చేశాడని, అనంతరం బావి మోటార్ కి ఉన్న ఫీజులు తీసి 5రోజులుగా గ్రామం మొత్తం నీళ్లు రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని వివరించారు.

ఇదేంటని అడిగిన వారిపై దాడులకు పాల్పడుతూ..దూసిస్తున్నాడని అన్నారు. పైగా ఆత్మహత్య చేసుకుంటానని తమని బెదిరిస్తునాడని వాపోయారు.తమ గ్రామంలో 400 ఏళ్ల నాటి పురతనమై లక్ష్మినరసింహా స్వామి ఆలయం ఉన్నదని,రేపు శుక్రవారం స్వాములవారి కల్యాణం ఉండగా,పని చేసుకోని,ఇల్లులు శుభ్రపరచుకుందామంటే నీళ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చొరవ తీసుకొని తమ సమస్య పరిష్కరించాలని తెట్టెలపాడు గ్రామ ప్రజలు ఎంపీడీఓ సిలార్ సాహెబ్ ను కోరారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsapp channel
👉 Follow us on Share chat

Next Story