జీపీఎస్, ఓపీఎస్ వెంటనే రెగ్యులర్ చేయాలి : పివైఎల్ డిమాండ్

by Sumithra |
జీపీఎస్, ఓపీఎస్ వెంటనే రెగ్యులర్ చేయాలి : పివైఎల్ డిమాండ్
X

దిశ, గుండాల : రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని పీవైఎల్ డిమాండ్ చేశారు. సోమవారం దిశతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న12,700 గ్రామపంచాయతీలలో దాదాపు 9,000 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 300 మంది ఔట్సోర్సింగ్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరి నియామక నోటిఫికేషన్ లో కూడా మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులరేజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ ఆ తర్వాత జీవో 26 ద్వారా మరొక సంవత్సరం పొడిగిస్తూ నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని నమ్మబలికించారన్నారు.

ఏప్రిల్ 11, 2023 నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఆ తర్వాత కూడా వీరిని యధావిధంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించిన ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం జీపీఎస్, ఓపీఎస్ లను నాలుగు సంవత్సరాల తర్వాత రెగ్యులరేజ్ చేస్తానన్న మాటని నెరవేర్చి, వీరిని వెంట వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story