- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం
దిశ, వైరా : నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది ఏళ్లగా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మెగా డీఎస్సీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైరాలోని రింగ్ రోడ్డు సెంటర్లో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో శనివారం రిలే దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రిలే దీక్ష చేస్తున్న ఎన్ఎస్ యూఐ నాయకులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతుందన్నారు.
రాష్ట్రంలో డీఎస్సీ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కొన్ని నోటిఫికేషన్లు ప్రకటనలకే పరిమతమవుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రకటనలు ఆచరణకు నోచుకోవటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేస్తుందనే ఆశతో నిరుద్యోగులు గత తొమ్మిదేళ్లగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ హైదరాబాదులో కోచింగ్ లు తీసుకుంటున్నారని చెప్పారు. అరకొరగా నిర్వహించిన పరీక్షలకు సంబంధించి పేపర్లు లీకేజీ
కావటంతో నిరుద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక అంశంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను ఎందుకు చేపట్టరని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నిటికీ నోటిఫికేషన్లు వేసి పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లగా నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసిందన్నారు.
ఇప్పటికైనా తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి తమ ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం పొంగులేటి పలు శుభాకార్యాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ విజయభాయి, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్, నాయకులు దార్న రాజశేఖర్, మిట్టపల్లి నాగి, పణితి సైదులు, చింత నిప్పు సుధాకర్, కన్నెగంటి హుస్సేన్, జాలాది రామకృష్ణ, ఎన్ఎస్ యూ ఐ నాయకులు పాల్గొన్నారు.