Telangana Weather Update : గోదావరి తగ్గుముఖం

by Sridhar Babu |   ( Updated:2023-07-21 14:33:19.0  )
Telangana Weather Update : గోదావరి తగ్గుముఖం
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అనంతరం రాత్రి 44.30 అడుగుల వరకు చేరుకున్న గోదావరి శుక్రవారం తెల్లవారుజాము నుండి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి 42.70 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలలోనే కొనసాగించాలని, పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story