- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
funeral : సైనిక అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
దిశ, భద్రాచలం : ఏనుగుల దాడిలో అస్సాం రాష్ట్రంలోని ఆర్మీ క్యాంపు పరిసరాల్లో మృతి చెందిన జవాన్ కొంగా సాయి చందర్ రావు అంత్యక్రియలు సైనిక అధికార లాంఛనాలతో మంగళవారం భద్రాచలంలో జరిగాయి. మృతదేహాన్ని అస్సాం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించిన ఆర్మీ అధికారులు అక్కడి నుంచి అంబులెన్స్‌లో స్వగ్రామమైన భద్రాచలంకు తీసుకొచ్చారు. తొలుత అస్సాంలో మృతదేహానికి నివాళ్లు అర్పించిన ఆర్మీ సిబ్బంది లాంఛనంగా విమానం వరకు విడ్కోలు పలికారు. అనంతరం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద కూడా ఆర్మీ సిబ్బంది మృతదేహానికి నివాళ్లుర్పించి పుష్పాంజలి ఘటించారు.
సాయిచందర్ మృతదేహం భద్రాచలం చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు, బంధుమిత్రులు తండోపతండాలుగా తరలివచ్చి సంతాపం ప్రకటించారు. అస్సాం, హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల నుండి కూడా వివిధ హోదాల్లో విధులు నిర్వహించే ఆర్మీ జవాన్లు భద్రాచలం చేరుకుని ఆర్మీ వస్త్రధారణతో సైనిక వందనం సమర్పించి మృత దేహంపై జాతీయ జెండాను కప్పారు. అనంతరం బస్టాండ్ ఎదురుగా ఉన్న సీఎస్ఐ చర్చి బరియల్ గ్రౌండ్ లో క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో ఖననం చేశారు. ఈ సందర్భంగా ఇంటి నుంచి బస్టాండ్ బరియల్ గ్రౌండ్ వరకు అంతియాత్ర ఘనంగా సాగింది. మృతదేహాన్ని ఖననం చేసే క్రమంలో అప్పటికే కప్పి ఉంచిన జాతీయ జెండాను గౌరవంగా తొలగించిన జవాన్లు సాయి చందర్ రావు భార్యకు దానిని అప్పగించారు.
ఆమె జెండాను అందుకుని గుండెలకు హత్తుకుని రోదిస్తున్న తీరును చూసిన కుటుంబీకులు, బంధుమిత్రులు, స్థానికులు బోరున విలపించారు. దేశరక్షణ సేవలో ఉన్న చందర్ రావు తన కుటుంబానికి జాతీయ జెండాను అందించి వెళ్లిపోయారని కన్నీరు మున్నీరయ్యారు. విధుల్లో నిబద్ధతగల జవాన్ గా పేరున్న ఆయన అందరితో కలివిడిగా, స్నేహ పూర్వకంగా మెలిగే వాడని అస్సాం ఆర్మీ క్యాంపు నుంచి వచ్చిన జవాన్ రెహమాన్ తో పాటు పలువురు జవాన్లు గుర్తు చేశారు. అతనితో ఉన్న సాన్నిహిత్యంతో అస్సాం నుంచి కూడా ఆర్మీ కుటుంబాలు తరలివచ్చాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉంది. జవాన్ మృతి వార్త తెలుసుకున్న భద్రాచలం సీఐ సంజీవరావుతో పాటు ట్రాఫిక్ ఎస్సై మధు ప్రసాద్ తదితరులు చందర్ రావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.