- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హంతకులకు మాజీ మంత్రి తుమ్మల వార్నింగ్.. కృష్ణయ్య కుటుంబానికి భరోసా
దిశ, ఖమ్మం రూరల్: టీఆర్‌ఎస్ పార్టీ నేత కృష్ణయ్యను చంపిన వారు ఎవరైనా సహించబోమమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వార్నింగ్ ఇచ్చారు. తమ్మినేని కృష్ణయ్య మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ.. కాలం చెల్లిన కొంతమంది అరాచకవాదులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలతో అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. వ్యక్తిగత ఎదుగుదల చూడలేక ఇలాంటి పిరికి చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణానికి ప్రజలు సహకరించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కోరారు. నివాళ్లర్పించిన వారిలో నాయకులు సాధు రమేష్‌రెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, పంతులు, శాఖమూరి రమేష్, వీరభధ్రం, యలగొండస్వామి, అంబటి సుబ్బారావు, సుధాకర్‌రెడ్డి, నాలుగు మండలాలకు చెందిన నాయకులు ఉన్నారు.
తమ్మినేని క్రిష్ణయ్యకు నివాళ్లర్పించిన ఎమ్మెల్యే కందాల, ఎమ్మెల్సీ తాతా మధు
టీఆర్ఎస్ పార్టీ నేత తమ్మినేని కృష్ణయ్య సీపీఎం నాయకులు చేతిలో హత్యకు గురైన విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణయ్య పార్థివదేహానికి నివాళ్లర్పించి, కుమారుడు నవీన్‌ను పరామర్శించారు. నివాళ్లర్పించిన వారిలో రూరల్ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, లక్ష్మణ్, రవి, మైబేలీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, జోన్నలగడ్డ రవికుమార్, పంతులు, నాయకులు ఉన్నారు.