- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీని వీడేది లేదన్న మాజీ ఎంపీ.. అవన్నీ అసత్య ప్రచారాలే అంటూ..
దిశ, ముదిగొండ: టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం సువర్ణపురం పెద్దమండవలోని పలు గ్రామాలను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో అనారోగ్యంతో చనిపోయిన వారింటికి వెళ్లి టీఆర్ఎస్ పార్టీ తరపున తానున్నానంటూ భరోసా కల్పించి, వారిని ఓదార్చారు. అనంతరం పెద్దమండవలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనపై జరగుతున్న ప్రచారాలను నమ్మవద్దని, అవన్నీ అసత్యాలని తెలిపారు.
తనను దెబ్బతీయడానికే గిట్టనివారు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తాను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరి ప్రసాద్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు తోట ధర్మారావు, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ అనంతరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు లంకెల బ్రహ్మారెడ్డి, పెద్దమండవ సర్పంచ్ చిట్టిపోగు రామారావు, వివిధ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.