శోభాయాత్రకు సర్వం సిద్ధం…నేటితో ముగియనున్న గణేష్ నవరాత్రులు

by Kalyani |
శోభాయాత్రకు సర్వం సిద్ధం…నేటితో ముగియనున్న గణేష్ నవరాత్రులు
X

దిశ ఖమ్మం సిటీ; గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపయ్యను నేడు శోభాయాత్ర ద్వారా భక్తులు నిమజ్జనం చేయనున్నారు. స్తంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపయ్యకు ఘనమైన శోభాయాత్ర నిర్వహించి మున్నేరు నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. నగరంలో భారీ బందోబస్తు మధ్య శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మున్నేరు కి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుండి శోభాయాత్ర ప్రారంభానికి అన్ని కమిటీల సభ్యులకు ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మద్యం దుకాణాలను కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. ఆదివారం చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున మండపాల్లో అన్నదానాలు నిర్వహించారు. శోభాయాత్ర అనంతరం ఘాట్ వద్ద ప్రతి విగ్రహం నిమజ్జనానికి ముందే ఒకరిద్దరూ భక్తులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేసేలా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్ వద్ద వైద్యం, సహాయ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డి ఆర్ ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విగ్రహాన్ని క్రమ పద్ధతిలో నిమజ్జనం చేసే విధంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేయడం జరిగింది.


Advertisement

Next Story

Most Viewed