- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థే : జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్
దిశ, సత్తుపల్లి:ప్రతి వ్యక్తి నిత్య నూతన విద్యార్థేనని కలెక్టర్ వీపీ.గౌతమ్ అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు.కొత్తూరు ఉమామహేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు. మనిషి ఎంత ఎదిగినా..ప్రతి వ్యక్తి నిత్య నూతన విద్యార్థేనని అన్నారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు తమ మేథా శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఈ ప్రాంత వాసిగా రాజ్యసభ సభ్యులుగా బండి పార్థసారధరెడ్డి ధాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు.
సత్తుపల్లి ప్రాంతానికి ఇప్పటికే రెండు కాలేజీల నిర్మాణం తో పాటు, రూ.100 కోట్ల వ్యయంతో కల్లూరు బస్టాండ్ నిర్మాణం, క్యాన్సర్ క్లీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. అంతకు ముందు 14వ వార్డులోని ఎస్సీ కమ్యూనిటీ భవనం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో బీటీ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా పనులు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి మండలంలో చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయిలో చేరుకున్నానని ఆయన తెలిపారు.
తన శక్తి మేరకు సత్తుపల్లి ప్రాంతానికి విద్యారంగంతో పాటు యువత, విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడూ ముందుంటానన్నారు. అనంతరం ఎంపీ పార్థసారథి రెడ్డిని జిల్లా గ్రంథాలయ శాఖ తరపున ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ ఎమ్మెల్యే వెంకట వీరయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, స్థానిక ఎమ్మార్వో శ్రీనివాసరావు, ఎంపీడీవో సుభాషిణి, మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోటా సుజలారాణి, కౌన్సిలర్ దాడి రఘు, కంటే నాగలక్ష్మి, అద్దంకి అనిల్, చాంద్ బాషా, వీరపనేని బాబి రాధిక, పలువురు బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థినీ, విద్యార్థులు పొల్గొన్నారు.