- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక సేవ ముసుగులో మందు విందు
దిశ, వైరా : అదో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ. అయితే ఆ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు ఏ స్థాయిలో నడుస్తాయో మందు విందులు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో నడుస్తుంటాయి. సమావేశాలు, మీట్ల పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో మద్యం ఏరులై పారుతుందంటే నమ్మశక్యం కాదేమో. అలాంటి కార్యక్రమమే ఆదివారం వైరా పట్టణ శివారులోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న కల్యాణ మండపంలో జరిగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో విస్తరించి ఉన్న స్వచ్ఛంద సంస్థ రీజనల్ మీట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ మీట్‌కు ఎన్నారై ఫౌండేషన్ ఉన్నత స్థాయి ప్రతినిధితో పాటు, ఆ స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . ఈ కార్యక్రమానికి జిల్లాలోని 10 నుంచి 12 క్లబ్బుల ప్రతినిధులు విచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా రీజనల్ మీట్ ముగిసిన తర్వాత అసలు కథ మొదలైంది. టీచర్స్ వన్ లీటర్ బాటిల్స్‌తో ఆ కళ్యాణం మండపంలో మద్యం ఏరులై పారింది.
విందు, వినోదాలు గురించి చెప్పనవసరం లేదు. అయితే ఏదైనా సమావేశం సందర్భంగా కాక్టైల్ పార్టీ నిర్వహించాలంటే ముందుగా ఎక్సైజ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు ఈ స్వచ్ఛంద సంస్థకు కనిపించవు. ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఎంజాయ్ పార్టీ సాయంత్రం 4:00 వరకు నిరాటంకంగా కొనసాగింది. ఎంతోమంది బడా వ్యాపారులు ప్రతినిధులుగా ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మందు విందులు జరగడం వైరా ప్రాంతంలో నిరంతరం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పార్టీలను ఈ క్లబ్ ప్రతినిధులు రిచ్ కార్యక్రమాలుగా భావిస్తున్నారు. ఈ విషయమై వైరా ఎక్సైజ్ సీఐ మమతను దిశ వివరణ కోరగా ఏ స్వచ్ఛంద సంస్థ కూడా కాక్టైల్ పార్టీకి తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు. అనుమతులు లేకుండా ఒక కళ్యాణమండపంలో కాక్టైల్ పార్టీ నిర్వహించిన విషయం తమ దృష్టికి రాలేదని విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.